1
00:00:00,100 --> 00:00:10,200
ఆ ప్రేమకి కొరత లేదు. తన కుమారుడినే ఇచ్చేటంతగా, తన కుమారుడినే త్యాగం చేసేటంతగా,

2
00:00:10,300 --> 00:00:20,800
తన కుమారుడు ప్రాణాల్నే అర్పించేటంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. లోకం అంటే కేవలము జంతుజాలం కాదండి,

3
00:00:20,900 --> 00:00:30,500
లోకం అంటే కేవలం పశుపక్షాదులు కాదండి, లోకం అంటే మానవులు. అంటే మనల్ని ప్రేమించి దేవుడు తన కుమారుడిని

4
00:00:30,600 --> 00:00:41,000
పంపించాడండి. అది ఇక్కడే అంటాడు, ఇక్కడ ఆ విషయం అంటాడు చదువుదాం: దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు.

5
00:00:41,100 --> 00:00:54,000
మనము ఆయన ద్వారా జీవించునట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.

6
00:00:54,100 --> 00:01:07,000
మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో

7
00:01:07,100 --> 00:01:17,500
ప్రేమ యున్నది. ఇందులో, అంటే దేవుడు తన కుమారుని ఇవ్వడంలో ఏమున్నదటండీ? ప్రేమాస్వరూపంటే నీ కొరకు ఏదైనా చేయగలడు.

8
00:01:17,600 --> 00:01:29,000
మనం చేస్తాం, మనం చేయగలిగినంత మాత్రమే చేస్తాం. మనం ఎవరినైనా ప్రేమిస్తే వారి కొరకు ఏదో కొద్దిపాటి త్యాగం చేస్తాం. కానీ

9
00:01:29,100 --> 00:01:41,200
దేవుడు చేసినంత త్యాగం మనం చేయలేం. తన కుమారుని ఇచ్చేటట్లుగా, తన కుమారుడు ప్రాణం పెట్టేటట్లుగా... అంటే ప్రేమ అంటే అదండి!

10
00:01:41,300 --> 00:01:54,000
మనమూ చెప్తాం, "మీరంటే చాలా ఇష్టమండి, మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నానండి". ఓ భర్త భార్యతో చెప్తాడు, "నువ్వంటే నాకు చాలా ఇష్టం". కానీ ఆ ప్రేమ

11
00:01:54,100 --> 00:02:06,000
క్రియారూపంలోకి వచ్చేసరికి కొంచెం తేడా కనబడతాది. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదండి. దేవుని ప్రేమ

12
00:02:06,100 --> 00:02:18,500
ఆయన తన కుమారుని పంపించేటట్లుగా, తన కుమారుని త్యాగం చేసేటట్లుగా కనుపరిచింది. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవుడు ప్రేమాస్వరూపి!

13
00:02:18,600 --> 00:02:30,000
దేవుడు ప్రేమాస్వరూపి, తన కుమారుని పంపించాడు. అందులో ఏమున్నదటండీ? ఆ ప్రేమ ఉంది. దేవుడు ఇంకెలాంటి వాడయ్యా అంటే,

14
00:02:30,100 --> 00:02:40,500
లేవియ కాండం 19వ అధ్యాయం, దేవుని యొక్క లక్షణాలు, రెండవ వచనాన్ని చదువుదాం. దేవుడు ఎలాంటివాడు?

15
00:02:40,600 --> 00:02:51,000
లేవియులకి... లేవియ కాండం 19వ అధ్యాయము, రెండవ వచనాన్ని చదువుదాం. లేవియ కాండం

16
00:02:51,100 --> 00:03:00,000
19వ అధ్యాయం, రెండవ వచనాన్ని చదువుతున్నాను: "మీరు పరిశుద్ధులై యుండవలెను; మీ దేవుడనైన యెహోవానగు నేను

17
00:03:00,100 --> 00:03:10,000
పరిశుద్ధుడను." దేవుడు ఎలాంటి వాడటండీ? పరిశుద్ధుడు. అంటే పాపం అనే దానికి ఆయన దగ్గర ఏ

18
00:03:10,100 --> 00:03:22,000
స్థానం లేదు, ఏ అవకాశం లేదు. పరిశుద్ధుడాయన. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడంటే ఏమాత్రం పాపానికి

19
00:03:22,100 --> 00:03:34,000
తావు లేనటువంటి ఆయన. అందుకే పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా మనకు చెప్తూ ఒకసారి చదువుదాం, పేతురు రాసిన మొదటి పత్రిక

20
00:03:34,100 --> 00:03:47,500
ఒకటవ అధ్యాయం, 14 నుంచి 16 వచనాల్లో రాయబడిన విషయాలు ఓసారి ధ్యానం చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక

21
00:03:47,600 --> 00:03:57,000
ఒకటవ అధ్యాయము, 14 నుంచి చదువుతున్నాను: "నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడి యున్నది. కాగా

22
00:03:57,100 --> 00:04:14,000
మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీకుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై యుండుడి." దేవుడు పరిశుద్ధుడు.