1
00:00:00,100 --> 00:00:08,200
జరిగిపోతా ఉంటే ఎప్పుడు ఎలాగ ఉంటాదటండి? ఆ ఎప్పుడు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతా ఉంటే సంతోషంగా ఉంటాది.

2
00:00:08,500 --> 00:00:20,500
మన పిల్లలు మనకు అనుకూలంగా ప్రవర్తిస్తా ఉంటే అంతకంటే సంతోషం ఏముందండి? అబ్బాయి చెప్పినట్టు వింటున్నాడు, అమ్మాయి చెప్పినట్టు వింటుంది.

3
00:00:20,800 --> 00:00:33,000
అబ్బాయి చెప్పినట్టు చదువుకుంటున్నాడు, మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు, అమ్మాయికి మంచి సంబంధం దొరికింది, పెళ్లి చేశాం. ఎలాగుంటాదండి? ఆ హ్యాపీ!

4
00:00:33,300 --> 00:00:44,500
ఇంకేంటండీ మా జీవితానికి ఆ సంతోషంగా... అంటే మన పిల్లలు మనం చెప్పినట్టు ప్రవర్తిస్తే మనకు సంతోషం. తరువాత,

5
00:00:45,000 --> 00:00:57,500
అప్పుడు ఒకసారి ప్రశ్నించుకుంటే మన పిల్లలు అలాగున్నారు, మరి మనం ఎవరి పిల్లలం? ఆ దేవుని పిల్లలం. అప్పుడు

6
00:00:58,000 --> 00:01:10,000
దేవుడు సంతోషంగా ఉండాలంటే? ఆ మనం దేవుడు చెప్పినట్టుగా వినగలిగితే, దేవుడు చెప్పినట్టుగా ఉండగలిగితే దేవుడు సంతోషిస్తాడు.

7
00:01:10,300 --> 00:01:23,500
యెషయా గ్రంథం 62వ అధ్యాయం, ఓసారి చదువుదాం. అంటే మనం సంతోషించడం వేరు, మనల్ని బట్టి దేవుడు సంతోషించడం వేరు.

8
00:01:23,800 --> 00:01:36,500
మనం అనుకున్నవి జరిగితే సంతోషంగా ఉంటాం, మనం కలిగి ఉన్న స్థితిని బట్టి సంతోషంగా ఉంటాం, మన పిల్లలు మన మాట విని మన చెప్పుచేతల్లో పెరుగుతా ఉంటే సంతోషంగా ఉంటాం.

9
00:01:36,800 --> 00:01:49,500
ఇవన్నీ మామూలే, ఇవన్నీ కామనే. అయితే మన సంతోషం వేరు, దేవుని సంతోషం వేరు. మనం సంతోషించడం వేరు, మనల్ని బట్టి దేవుడు సంతోషించడం వేరు.

10
00:01:50,000 --> 00:02:03,000
ఓసారి చదువుదాం 62వ అధ్యాయం, అంటే సంతోషాలు ఎన్ని రకాలుగా ఉంటాయో చెప్తున్నాడిక్కడ. 62వ అధ్యాయం ఐదవ వచనం:

11
00:02:03,500 --> 00:02:18,500
యవ్వనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకొనునట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకొనెదరు. పెండ్లికుమారుడు పెండ్లికుమారుడు పెండ్లికూతురుని చూచి ఏం చేస్తాడటండీ? సంతోషమే కాదండి!

12
00:02:19,000 --> 00:02:30,000
పెళ్ళికొడుకు పెళ్ళికూతురంటే ఎంత ఆనందం ఆ స్టేజ్ మీద, పెళ్ళి మీద! పెండ్లికుమారుడు పెండ్లికూతురిని చూసి లేక పెండ్లికూతురు పెండ్లికుమారుడిని చూసి సంతోషిస్తారు. ఆ,

13
00:02:30,300 --> 00:02:40,500
నీ దేవుడు నిన్ను గూర్చి ఏం చేస్తాడటండీ? ఆ నీ దేవుడు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషిస్తాడు.

14
00:02:41,000 --> 00:02:54,500
ఎప్పుడయ్యా అంటే, నీవు అన్ని విషయాలలో దేవునికి అనుకూలంగా ప్రవర్తిస్తే అప్పుడు నీ దేవుడు నిన్ను గూర్చి ఏం చేస్తాడటండీ? సంతోషిస్తాడు.

15
00:02:55,000 --> 00:03:07,000
మన సంతోషం వేరే, దేవుని సంతోషం వేరే. అంటే మనం మనకున్న స్థితిని బట్టి సంతోషిస్తున్నాం. మన సంతోషం తాత్కాలికం, టెంపరరీ.

16
00:03:07,500 --> 00:03:19,500
కొన్ని రోజులుండొచ్చు, కొద్ది గడియలుండొచ్చు, కొన్ని గంటలుండొచ్చు, లేక కొన్ని వారాలుండొచ్చు, మళ్లీ ఏదో ఒక సమస్య వస్తాది.

17
00:03:20,000 --> 00:03:25,000
కానీ మనల్ని బట్టి దేవుడు సంతోషించాలటండీ.