1
00:00:00,100 --> 00:00:09,500
ఒకవేళ ఎప్పుడైనా అందులో తేడా వచ్చిందంటే, ఏంటి ఇన్నాళ్లు ఇలాగనుకున్నాం, ఇదేంటి అనేటువంటి ఆలోచన వస్తాది.

2
00:00:09,700 --> 00:00:18,500
వీళ్ళు అలాగే బ్రతుకుతున్నారు. కీడుకు ప్రతికీడు ఎవ్వరికీని ఆ చేయటం లేదు.

3
00:00:18,700 --> 00:00:34,500
అందుకు ఈ కంక్లూజన్‌లో 15వ అధ్యాయం వచ్చేసరికి పౌలుగారు అదంతా గుర్తించి, మీ సహజసిద్ధమైన లక్షణం, మీ వాస్తవికమైన లక్షణం ఏంటంటే మీరు కేవలము ఎలాంటివారట? మంచివారు.

4
00:00:34,700 --> 00:00:46,500
ఎందుకు మంచివారయ్యారు? ఎవరికీ ఏం చేయట్లేదటండి. ఆ కీడు తలపెట్టడం లేదు, ఎవ్వరికీ కీడు తలపెట్టలేదు. ఓకే, కీడు తలపెట్టలేదు, మంచిదే.

5
00:00:46,700 --> 00:01:02,500
రెండో విషయం, ఎందుకు వీళ్ళు కేవలము మంచివారయ్యారు? ఎందుకు వీళ్ళు కేవలము మంచివారయ్యారు అంటే తమ వలె అందరూ బాగుండాలని కోరుకుంటున్నారటండి వీళ్ళు.

6
00:01:02,700 --> 00:01:13,500
తమ వలె అందరూ బాగుండాలి. అంటే నేను బాగా ఉండాలి, నాలాగే అందరూ ఉండాలి. యేసుప్రభువు బోధనే తూచా తప్పకుండా పాటిస్తున్నారు వీళ్ళు.

7
00:01:13,700 --> 00:01:28,500
యేసుప్రభువు యొక్క బోధని కొండమీద చేసినటువంటి ప్రసంగాన్ని, క్రొత్త నిబంధన సంబంధమైనటువంటి వాక్యాన్ని వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అందరూ బాగుండాలి.

8
00:01:28,700 --> 00:01:41,500
నేను ఎలాగున్నానో నాకులాగే మిగిలినవారు కూడా అందరూ బాగుండాలి. అంటే అందరూ క్షేమంగానే ఉండాలి, అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నారట.

9
00:01:41,700 --> 00:01:55,500
మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం, ఆడ యేసుప్రభువు వారు కొండమీద ప్రసంగం చేస్తూ చెప్పినటువంటి విషయాన్ని చదువుదాం. అందరూ బాగుండాలి. 7వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం.

10
00:01:55,700 --> 00:02:13,500
"కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై యున్నది." మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయండి.

11
00:02:13,700 --> 00:02:27,500
అంటే వీళ్ళు కేవలం మంచివారు ఎలాగయ్యారయ్యా అంటే, తమ వలె అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు. అది మంచి స్వభావం అండి.

12
00:02:27,700 --> 00:02:40,500
అందరూ బాగుండాలని కోరుకోవడం అనేటువంటిది మంచి స్వభావం. అందరూ బాగుండాలి. ఈ పొరుగువాళ్ళు, ఆ పొరుగువాళ్ళు, ఇరుగుపొరుగు వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ బాగుండాలి.

13
00:02:40,700 --> 00:02:55,500
నేను ఎలా ఉన్నానో సుఖంగా, నా కుటుంబం ఎలాగుందో సుఖంగా, నా కుటుంబం ఎలాగుందో క్షేమంగా, మిగిలినవారు కూడా అలాగే ఉండాలని కోరుకోవాలి. కానీ దురదృష్టం ఏంటంటే

14
00:02:55,700 --> 00:03:09,500
ఎక్కువ శాతం నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, మిగిలినవారు ఎలా పోతే నాకేంటి, ఎలా ఉంటే నాకేంటి అని నిజానికి రక్తసంబంధీకుల గురించి కూడా అలాగా ఫీల్ అయ్యేవారు ఉన్నారు.

15
00:03:09,700 --> 00:03:23,500
అన్నదమ్ములు గానీ, అక్కచెల్లెళ్ళు గానీ, ఇంకా కుటుంబస్తులు గానీ నా కుటుంబం బాగా ఉంటే చాలు, మిగిలినవారి గురించి నాకెందుకండి వాళ్ళకి మాకేం సంబంధం లేదండి అన్నట్టుగా ఉన్నారు.

16
00:03:23,700 --> 00:03:36,500
కానీ అలా కాదటండి. వీళ్ళు కేవలము మంచివారు ఎలాగయ్యారంటే అందరూ బాగుండాలని కోరుకుంటున్నారట. ఏ సమస్యా లేకుండా నా పక్కనోళ్ళు, నా ఇరుగుపొరుగు వాళ్ళు,

17
00:03:36,700 --> 00:03:49,500
నా గ్రామంలో ఉన్నవారు, ఈ వీధిలో ఉన్నవారు అందరూ బాగుండాలి. అందరూ బాగుంటే ఎంత సంతోషంగా ఉంటాదండి? ఎంత ఆనందంగా ఉంటాది? మనం బాగా ఉన్నాం, పక్కనోళ్ళు బాధపడుతున్నారు,

18
00:03:49,700 --> 00:04:01,500
పక్కనోళ్ళు సమస్యల్లో ఉన్నారు, పక్కనోళ్ళు కష్టంలో ఉన్నారు, మనకెలాగుంటాదండి? బాగా ఉండదండి, బాగుండలేం.

19
00:04:01,700 --> 00:04:15,500
మనం బాగా ఉండి పక్కనోళ్ళు కూడా బాగా ఉంటే హ్యాపీగా ఉంటాం. మనం బాగా ఉండి మన ఇరుగుపొరుగు వాళ్ళు బాగా ఉంటే హ్యాపీగా ఉంటాం. మనం బాగా ఉన్నాం, మిగిలినోళ్ళందరూ చాలా ఇబ్బందిలో ఉన్నారు.

20
00:04:15,700 --> 00:04:29,500
మనం బాగా ఉన్నాం, మా అన్నయ్యో, మా తమ్ముడో, మా చెల్లో, మా అక్కో, మా కుటుంబంలో మిగిలినవారు ఎవరో బాగాలేదు, అయినా బాగానే ఉంటున్నాం లేండి కొంతమంది. కాదండి.

21
00:04:29,700 --> 00:04:43,500
అందరూ బాగుండాలని కోరుకోవాలి. వీరు అలాంటి అందుకే వీళ్ళకి మంచి గుర్తింపుని ఇచ్చాడు పరిశుద్ధాత్ముడు. పౌలు గారు అది నిర్ధారణ చేస్తున్నాడు.

22
00:04:43,700 --> 00:04:58,500
మీరు కేవలము నా సహోదరులారా, మీరు కేవలము ఎలాంటివారటండి? మంచివారు. అంటే అందులో ఏమీ కలిపేటువంటి చెడు అనేటువంటిది లేదు.

23
00:04:58,700 --> 00:05:09,500
మూడు. వీళ్ళు ఎందుకు కేవలం మంచివారయ్యారంటే ఇతరుల క్షేమాన్ని కోరేవారటండి వీళ్ళు. ఇతరుల క్షేమాన్ని...